గంజాయి సాగు ధ్వంసం
రాయగడ: గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపిన పోలీస్ జిల్లా యంత్రాంగం ఆ దిశగా దాడులు నిర్వహిస్తోంది. డ్రోన్ల సహాయంతో ముందస్తుగా సమాచారం తెలుసుకుంటోంది. మంగళవారం జిల్లాలోని మారుమూల ప్రాంతమైన చంద్రపూర్ సమితి పరిధిలో గల సిరిపూర్, సనపంకాల్ అటవీ ప్రాంతంలో సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్న గంజాయి సాగును పోలీసులు ధ్వంసం చేశారు. అనంతరం మొక్కలను తగలబెట్టారు.
రూ.5కోట్లు విలువైన గంజాయి ధ్వంసం
మల్కన్గిసి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి బడపోధర్ పంచాయతీ కంధగూఢ గ్రామంలోని 35 ఎకరాల్లో సాగు చేస్తున్న 55,000 వేల గంజాయి మొక్కలను నరికి కాల్చేశారు. చిత్రకొండ ఎకై ్సజ్ పోలీసులు, డీవీఎఫ్ జవాన్లు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ గంజాయి విలువ రూ.5 కోట్లకు పైగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment