మహేంద్రగిరిలో ఏడు ఎకో రిసార్టులకు బుకింగ్ ప్రారంభం
పర్లాకిమిడి: పవిత్ర మహేంద్రగిరి పర్వతం వద్ద పర్యాటకుల కోసం నిర్మించిన ఏడు ఎకో రిసార్టులు, మూడు డార్మిటరీలు ఈనెల 25 నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయని జిల్లా అటవీ శాఖ అధికారి సుబ్రహ్మణ్యం ఆనంద్ విలేకరులతో తెలిపారు. స్థానిక డీఎఫ్‌ఓ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. మహేంద్రగిరి ఎకో కాటేజీలో ఒకరోజు పర్యాటకులు ఉండటానికి రోజుకు రూ.4,333 ధర నిర్ణయించామని, డార్మిటరీల ధర ఇంకా ఖరారు కాలేదని అన్నారు. ప్రతి పర్యాటకునికి అన్నివిధాలా సౌకర్యాలతో పాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న లంచ్, రాత్రి డిన్నర్ ఉంటాయని తెలిపారు. ఆధ్యాత్మిక పవిత్ర స్థలంలో కేంద్ర ప్రభుత్వం 7 కాటేజీలు ని ర్మించిందని, కనీసం 15 మంది ఈ కాటేజీలలో ఉండవచ్చని అన్నారు. అయితే ఈ కాటేజీలలో వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుందన్నారు. ప్రకృతి అందాలు, బయోడైవర్సిటీ, కుంతీ, యుధిస్టర, భీం, పరశురాం కుండ్‌లు సందిర్శించి వింత అనుభూతి పొందవచ్చని డీఎఫ్‌ఓ ఆనంద్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment