భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభలో 2024–25 ఆర్థిక సంవత్సరపు అదనపు బడ్జెటు ప్రవేశ పెట్టారు. ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఈ బడ్జెట్ ప్రతిపాదించారు. అనుబంధ బడ్జెటు పరిమాణం రూ. 12,156 కోట్లు.
కొత్త ప్రతిపాదనలు
సభలో ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన 2024–25 ఆర్థిక సంవత్సరపు అనుబంధ బడ్జెటులో ప్రవాస భారతీయ దివస్ పాలన, కేంద్ర సాయుధ పోలీసు దళం మోహరింపు, పోలీసు ఠాణాలు, ఔటు పోస్టులో సీసీటీవీ నిఘా వ్యవస్థ, పూరీ శ్రీ జగన్నాథుని రత్న భాండాగారం కార్యకలాపాల వ్యయం కొత్తగా జోడించిన అనుబంధ ప్రతిపాదనలుగా పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో పూరీ శ్రీ జగన్నాథుని రత్న భాండాగారం కార్యకలాపాల కోసం రూ. 5 కోట్లు వ్యయం ప్రతిపాదించారు. శ్రీ జగన్నాథుని రథ యాత్రలో సాధారణ భక్తులు, యాత్రికుల్ని రథాలపైకి నివారించడంతో దైతపతి సేవాయత్‌లకు పరిహారం చెల్లించేందుకు రూ.12 కోట్లు, శ్రీ జగన్నాథుని పొడి ప్రసాదం పంపిణీ కోసం రూ. 15 కోట్లు, నగరంలో ప్రవాసి భారతీయ దినోత్సవం కోసం రూ.125 కోట్లు, సీఏపీఎఫ్ మోహరింపు కోసం రూ. 299 కోట్లు, పోలీసు ఠాణాలు, ఔటు పోస్టుల్లో సీసీటీవీ కెమెరా వ్యవస్థ కోసం రూ. 51 కోట్లు, శ్రీ మందిర్ ప్రాకారం విస్తరణ వ్యయ ప్రణాళిక రూ. 26 కోట్లు, అగ్ని మాపక వ్యవస్థ ఆధునికీకరణ, విస్తరణ కోసం రూ. 120 కోట్లు, వరదల నియంత్రణ, మురికి నీటి ప్రవాహ వ్యవస్థ నిర్వహణ కోసం రూ. 66 కోట్లు, మధు బాబు ఫించను పథకానికి రూ. 338 కోట్లు, గోపబంధు జన ఆరోగ్య యోజన కోసం రూ. 644 కోట్లు, సుభద్ర యోజన కోసం రూ. 1,196 కోట్లు, అధికారిక పాలన వ్యవహారాల కోసం రూ. 1,685 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కోసం రూ. 15 కోట్లు, రాష్ట్ర శాసన సభ భవనం నిర్మాణం కోసం రూ. 6 కోట్లు, సిబ్బంది రాష్ట్ర బీమా ఈఎస్‌ఐ ఔషధ కొనుగోలు కోసం రూ. 15 కోట్లు, ఒడిశా మాధ్యమిక విద్యా బోర్డు కోసం రూ. 13 కోట్లు, ఎత్తిపోతల నీటి పథకం కోసం రూ.20 కోట్లు, 22 ఐటీఐ ప్రాంగణాల్లో ఉత్కర్ష కేంద్రాల ఏర్పాటు కోసం రూ.130 కోట్లు, ధర్తి ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కోసం రూ. 92 కోట్లు, నియోజక వర్గాల వారీగా కనీస అవసరాల కోసం రూ. 142 కోట్లు 2024–25 ఆర్థిక సంవత్సరపు అనుబంధ బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
రైతు సంక్షేమం, ఆహార భద్రత
అనుబంధ బడ్జెటులో రైతు సంక్షేమం, ఆహార భద్రత కోసం ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. వ్యవసాయ ఉత్పాదనల సేకరణ, నిల్వ ప్రక్రియ నిర్వహణ కోసం రూ. 59 కోట్లు, గ్రామాల వారీ ఖరీఫ్ సీజనులో వరి సాగు కోసం రూ. 6 కోట్లు, రాష్ట్రీయ పశు ధన్ వికాస్ యోజన కింద శ్వేత విప్లవం కోసం రూ. 91 కోట్లు నిధులు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment