నాసిరకం బియ్యం సరఫరా!
రాయగడ: అంగన్‌వాడీ కేంద్రాలకు నాసిరకం బియ్యం సరఫరా కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొద్దిరోజుల క్రితం జిల్లాలోని కాసీపూర్ సమితిలో పురుగు పట్టిన రేషన్ బియ్యాన్ని డిపోకు పంపించడంతో వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులు నిరాకరించారు. వెంటనే స్పందించిన జిల్లా అధికారులు ఆ బియ్యాన్ని తిరిగి తీసుకుని మిల్లుకు తరలించారు. అక్కడ శుభ్రపరిచిన అనంతరం తిరిగి డిపోకు పంపించారు. కొద్ది నెలలుగా జిల్లాలో గల రేషన్ డిపోలతోపాటు తాజాగా స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని గల 27 అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బియ్యంలో కూడా పురుగులు ఉండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు తిరష్కరిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. బియ్యంలో పురుగులు ఉన్నప్పటికీ అధికారులు కనీసం వాటి నాణ్యతను పరిశీలించకుండా డిపోలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు తరలిస్తుండటంతో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో గల అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే నాసిరకం బియ్యాన్ని వెనక్కు తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment