జయపురం:
ఆధునికత కారణంగా ఆదివాసీల ప్రాచీన కళలు మరుగున పడుతున్నాయని, వాటిని వెలుగులోకి తీసుకురావడానికి జాతీయ స్థాయి ఆదివాసీ మహోత్సవం కొరాపుట్ పర్వ్ దోహదపడుతుందని ఎమ్మెల్యే రామచంద్ర కడమ్ అన్నారు. దేవమాలి పర్వతంపై పొట్టంగి సమితి స్థాయి కొరాపుట్ పర్వ్ మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఆదివాసీలకు కళలు పుట్టుకతోనే వస్తాయన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ ప్రజలు తమ సంప్రదాయ నృత్య విన్యాసాలతో ఉర్రూతలూగించారు. ఉత్సవాల్లో ప్రముఖ ఆదివాసీ నేత మాజీ మంత్రి జయరాం పంగి, పొట్టంగి మాజీ ఎమ్మెల్యే ప్రఫుల్ల కుమార్ పంగి, గోపాల కృష్ణ బెవర్త, బీడీఓ, పోలీసు అధికారులు, సర్పంచ్‌లు సమితి సభ్యులు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment