కలెక్టరేట్ ముట్టడి
రాయగడ: సంజుక్త కిషాన్ మోర్చా ఆధ్వర్యంలో వివిధ ట్రేడ్ యూనియన్లు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు. స్థానిక ఐబీ నుంచి కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం మెయిన్ గేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి పేరిట ఒక వినతిపత్రం సమర్పించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తులు వంటి వాటిపై జీఎస్టీ మినహాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి గొమాంగో, ఐఎన్టీయూసీ నాయకుడు భవానీ జెన్న, హరిచందన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment