శ్రీమందిరంలోకి మొబైళ్లు వద్దు | - | Sakshi
Sakshi News home page

శ్రీమందిరంలోకి మొబైళ్లు వద్దు

Published Wed, Jan 22 2025 1:31 AM | Last Updated on Wed, Jan 22 2025 1:30 AM

శ్రీమ

శ్రీమందిరంలోకి మొబైళ్లు వద్దు

భువనేశ్వర్‌:

ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న పూరీ శ్రీ జగన్నాథ మందిరం తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ఎప్పటికప్పుడు ఈ మందిరం లోపలి దృశ్యాలు, కట్టడాలకు సంబంధించిన సమాచారం సాంఘిక మాధ్యమాల్లో వస్తున్నాయి. ఈ పరిస్థితిపై సర్వత్రా విచారం వ్యక్తం అవుతుంది. ఈ పరిస్థితి నివారణకు ఆలయ నిర్వాహక యంత్రాంగం నడుం బిగించింది. పలు ప్రాంతాల నుంచి విచ్చేసే యాత్రికులు, పర్యాటకులు, భక్తుల్ని చైతన్య పరిచేందుకు శ్రీ మందిరం నలు వైపుల మొబైల్‌ ఫోను వినియోగం నిషేధంపై అవగాహన పోస్టర్లు అంటించింది. ఒడియా, ఆంగ్ల భాషల్లో ఈ పోస్టర్లు రూపొందించారు. నిషేధ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతామని ఈ పోస్టర్లలో హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
శ్రీమందిరంలోకి మొబైళ్లు వద్దు 1
1/2

శ్రీమందిరంలోకి మొబైళ్లు వద్దు

శ్రీమందిరంలోకి మొబైళ్లు వద్దు 2
2/2

శ్రీమందిరంలోకి మొబైళ్లు వద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement