రాష్ట్రాన్ని విస్మరించారు: నిరంజన్ పట్నాయక్
2025 – 26 ఆర్థిక సంవత్సరపు కేంద్ర బడ్జెట్‌లో ఒడిశాను పూర్తిగా విస్మరించారు. రాష్ట్రం నుంచి 21 మంది ఎంపీల్లో 20 మంది బీజేపీ అభ్యర్థులు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితుల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి మొండిచేయి చూపిందని రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి నిరంజన్ పట్నాయక్ నిరుత్సాహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సంబంధించి కొత్త బడ్జెటులో ఒక్క ప్రధాన ప్రకటన కూడా లేదని వేలెత్తి చూపారు. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి వర్గం నుంచి రూ.54.18 లక్షల కోట్ల ఆదాయపు పన్ను వసూలు చేసింది. ఈ బడ్జెటులో రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను మినహాయింపు ప్రకటించడం కంటి తుడుపు చర్యగా పేర్కొన్నారు. ఇది బూటకపు వాగ్దానాలతో కూడిన సరికొత్త బడ్జెట్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మోదీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాను నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్‌గా మార్చిందని దుమ్మెత్తిపోశారు. పాత పథకాలను కొత్త పేర్లుతో మార్చి ప్రభావం శూన్య బడ్జెట్‌ని ప్రజలకు కానుకగా సమర్పించి బురిడీ కొట్టించిందని ఆరోపించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
Comments
Please login to add a commentAdd a comment