ఒడిశా రాష్ట్రం ప్రతీ సంవత్సరం అనేక ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లుతోందని మాజీ సీఎం, విపక్ష నేత నవీన్ పట్నాయక్ అన్నారు. ఈ విపత్కర పరిస్థితి దృష్ట్యా రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా న్యాయసమ్మతమైన అభ్యర్థన అని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేసి, ఒడిశా రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరి హోదాను కేంద్రం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. అలాగే నిరుద్యోగం, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల గురించి ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment