ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో అధికారులు ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా చేపట్టాలని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి కోరారు. ఈ మేరకు పలువురు రైతులతో పాటు ఆయన కలెక్టర్‌ను శనివారం కలిశారు. జనవరి 7వ తేదీన ధాన్యం కొనుగోళ్లకు మండీలు తెరచినా, ఇప్పటివరకు 90 శాతం మంది రైతులు ప్రభుత్వ మద్దతు ధరకు అమ్మలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 2,12,212 క్వింటాళ్ల ధాన్యం సేకరణ అధికారులు లక్ష్యం పెట్టుకోగా, మొదటి పర్యాయం ఇప్పటివరకూ కనీసం 50 శాతం కూడా అధికారులు ఖరీఫ్ ధాన్యం సేకరించలేకపోయారన్నారు. అందువలన కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ను కలిసినవారిలో కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల సాయమ్మ, జెడ్పీటీసీ ఎస్.బాలరాజు, సీనియర్ బీజేడీ నాయకులు ఎస్.గజపతిరావు, జి.లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment