ముగిసిన అంతర్ కళాశాలల క్రీడా పోటీలు
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల క్రీడా పోటీలు శనివారంతో ముగిశాయి. ఫూల్‌బెడ ప్రాంతంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ముగింపు పోటీల్లో వర్సిటీ ఉప కులపతి ప్రొ.దేవీ ప్రసాద్ మిశ్ర, రిజిస్ట్రార్ రంజన్ కుమార్ మిశ్రలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ దేవీప్రసాద్ మిశ్ర మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు పోటీలు ప్రశాంతంగా జరిగినందుకు సంతోషంగా ఉందన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని పేర్కొన్నారు. క్రీడా ఉత్సవంలో ఓవరాల్ చాంపియన్స్‌గా విక్రమదేవ్ విశ్వద్యాలయ పురుషుల టీమ్, కొరాపుట్ ప్రభుత్వ కళాశాల మహిళా టీమ్‌లు నిలిచాయి. అదేవిధంగా వ్యక్తిగత క్రీడాకారుల్లో నవరంగపూర్ ఆదర్శ స్నాతక కళాశాల విద్యార్థి తులారాం మాఝి చాంపియన్ కాగా, కొరాపుట్ ప్రభుత్వ కళాశాల జానకీ చలాన్ వ్యక్తిగత మహిళా చాంపియన్‌గా నిలిచారు. విజేతలను పలువురు అభినందించారు. విజేతలు విశ్వవిద్యాలయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment