నాయకులతో ఆత్మీయ సమావేశం
బలిజిపేట: పార్టీ అధికారంలో లేకపోయినా, తన గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు నా ఆత్మీయులేనని, మీ అందరి ఆదరణ మరవలేనిదని దానిని ఆదృష్టంగా భావిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే జోగారావు అన్నా రు. ఈ మేరకు బలిజిపేటలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఆదివారం ఆత్మీయ సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలను గ్రామస్థాయిలో కలిసి వారితో మమేకమై, అందరం కలిసి రానున్న రోజులలో పార్టీకి అండగా నిలిచేందుకు అడుగులు ముందుకు వేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. భవిషత్ కార్యాచరణపై చర్చించారు. మనస్పర్థలు మాని అందరం కలిసి, మెలిసి ఉండాలని కోరారు. పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేర పార్టీని నడిపించుకోవాలని సూచించారు.
మేధావి వర్గం అధ్యక్షుడికి సన్మానం
వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా మేధావి వర్గం అద్యక్షుడిగా నియమితులైన పోరాన శ్రీరామచంద్ర నాయుడు(పీఎస్‌ఆర్ నాయుడు)ను మాజీ ఎమ్మెల్యే జోగారావు, పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.
పార్టీ నాయకుడి కుటుంబానికి పరామర్శ
చిలకలపల్లి గ్రామానికి చెందిన పార్టీ నాయకుడు ఎస్.వాసుదేవరావు తల్లి సత్యవతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమెకు నివాళులర్పించి వాసుదేవరావు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే జోగారావు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పి.మురళీకృష్ణ, ఎంపీపీ నాగమణి, జెడ్పీటీసీ ఎ.రవికుమార్, మండల ఉపాధ్యక్షుడు వి.సాయిరాం, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment