శ్రమదానంతో రోడ్లు వేసుకుంటున్న గిరిజనులు
సాలూరు: కూటమి ప్రభుత్వంలో వంద రోజుల్లో వంద రోడ్లు, ముమ్మరంగా అభివృద్ధి పనులు అంటూ ఆర్భాటాలు చేస్తున్న నేతల ఊకదంపుడు ఉపన్యాసాలు పక్కనపెడితే, గిరిశిఖర గ్రామాల్లో గిరిజ నులు శ్రమదానంతో రోడ్డు వేసుకుంటున్న పరిస్థితి. స్వయానా గిరిజనసంక్షేమశాఖామంత్రి, సీ్త్రశిశుసంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రాతిని ధ్యం వహిస్తున్న సాలూరు నియోజకవర్గంలోనే సాలూరు మండలం కొదమ పంచాయతీలో గల చింతామల గ్రామస్తులు తమ గ్రామానికి రోడ్డు లేకపోవడంతో శ్రమదానంతో రోడ్డు వేసుకుంటున్నా రు. గిరిశిఖర చింతామల నుంచి సమీప ఒడిశా రాష్ట్రం శబ్కమారి వరకు సుమారు మూడున్నర కిలోమీటర్లు శ్రమదానంతో రోడ్డు వేసుకుంటున్నా రు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాటి ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర కృషితో పట్టుచెన్నేరు, పగులుచిన్నేరు సమీపం రోడ్డు నుంచి లొద్ద వరకు రోడ్డు మంజూరుచేసి పనులు చేపట్టారు.లొద్ద నుంచి చింతామలకు సుమారు 5 కి.మీ.దూరం ఉంది. ఇదంతా పూర్తిగా అటవీప్రాంతం. అయితే తమకు ఎప్పటికీ రోడ్డు పూర్తికాకపోవడంతో ఇటు ఆంధ్రా కంటే అటు వైపు దగ్గరగా ఉన్న ఒడిశా వైపు రోడ్డు వేసుకోవాలని గిరిజనులు భావించారు. ఈ ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణం చేస్తుందన్న నమ్మకంలేని గిరిజనులు శ్రమదానంతో చింతామల నుంచి శబ్కమారికి రోడ్డును వేసుకుంటున్నారు. అటవీమార్గంలో రాళ్లు, రప్పలు, కొండలు డొలచి, చెట్లు, మొక్కలను తొలగించి రోడ్డును వేసుకున్నారు. కొదమ పంచాయతీలో పీసా ఎన్నికలు కూడా జరగలేదని స్థానిక గిరిజనులు తెలుపుతూ మా హక్కులను కోల్పోతున్నామని వాపోతున్నారు. అధికారులు, ఈ కూటమి ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment