30న మరియగిరి యాత్ర
వీరఘట్టం: మండల సమీపంలోని వెంకమ్మచెరువుకు ఆనుకున్న ఉన్న కొండపై వెలిసిన మరియగిరి జాతర ఈ నెల 30న నిర్వహించనున్నారు. ఇందుకోసం యాత్రా ప్రాంగణంలో జరగబోయే దివ్య పూజ కోసం ప్రార్థనా మందిరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. ఈ మేరకు ఉత్సవానికి తొమ్మిది రోజుల ముందు నుంచి చేపట్టబోయే నవదిన పూజలు ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం మేత్రాసనం పీఠాధిపతి రాయిరాల విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న నవదిన పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన పూజల్లో వీరఘట్టం, చిట్టిపూడివలస, సివిని, పార్వతీపురం, బెలగాం, గరుగుబిల్లి, తూడి, పాలకొండ, వంగర, తలవరం, సంకిలి, నవగాం, పాలవలస గురు మండలాల పీఠాధిపతులు పాల్గొన్నారు. 30వ తేదీ ఉదయం నడుకూరు ఆర్‌సీఎం చర్చి నుంచి మరియగిరి శిఖరం వరకు మేరిమాత ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి, దివ్య పూజను చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 30 వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
ప్రారంభమైన నవదిన పూజలు
ఏర్పాట్లు పూర్తి..
ఈ నెల 30న జరగనున్న మేరీమాత ఉత్సవం కోసం ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నడకదారిలో అన్ని వసతులు కల్పిస్తున్నాం. ఈ నెల 29 వరకు నవదిన పూజలు జరుగుతాయి. – విజయ్‌రెడ్డి, ఫాదర్, మరియగిరి
Comments
Please login to add a commentAdd a comment