కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకోవా
పార్వతీపురంటౌన్: కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ బంటు దాసు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పార్వతీపురం పట్టణంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న పోరాటాలను ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం మొండిగా వెళ్తే తీవ్రపరిణామలు తప్పవని హెచ్చరించారు. రైతు పండించే పంటలకు మద్దతు ధర ఇవ్వాలని కోరారు. దొడ్డి దారిన అమలుకు పూనుకున్న రైతు వ్యతిరేక నల్ల చట్టాలను, లేబర్‌కోడ్ లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎం.ఎస్ స్వామి నాథన్ సిఫార్స్‌ను అమలు చేయాలన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేసి వేతనం, పని దినాలు పెంచాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలు తగ్గించాలని, నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేయాలనీ కోరారు. విశాఖ ఉక్కును ప్రభుత్వమే సమర్థవంతంగా నడపాలని సూచించారు. కార్యక్రమంలో సభ్యులు బుడితి అప్పల నాయుడు, మోనంగి భాస్కర రావు, బొత్స నర్సింగరావు, పి.సంగం, పాలక రంజిత్ కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు, నాయకులు రెడ్డి వేణు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవ, ప్రగతి శీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పోలా రమణి సీపీఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పెడలా భాస్కర్ రావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శులు వై. మన్మథరావు, బీవీ రమణ, శ్రామిక మహిళా సంఘం జిల్లా కార్యదర్శి వి.ఇందిర, రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ జిల్లా నాయకుడు విశ్వేశ్వరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగల దాలినాయుడు, సుంకి సర్పంచ్ కరణం రవీంద్ర, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు, వ్యవసాయకార్మిక సంఘం నాయకులు గరుగుబిల్లి సూరయ్య, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు బంకురు సూరిబాబు, పడాల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment