భక్తిశ్రద్ధలతో శ్రీపంచమి
పర్లాకిమిడి: వసంత పంచమి సందర్భంగా స్థానిక సరస్వతీ శిశి విద్యా మందిర్‌లో భక్తిశ్రద్ధలతో సరస్వతీ దేవి పూజలు నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం, పాఠశాలల్లో పేర్లు నమోదు కార్యక్రమం చేశారు. గుండిచాబడి వద్ద గాయత్రీ మందిరంలో చిన్నారులకు అక్షరాభ్యాసం, యుక్త వయస్సు బాలురుకు ఉపనయనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాయత్రీ పరివార్ సభ్యులు రజనీ చౌదురి, విఘ్నరాజ్ పండా, శివపట్నాయిక్, బిఘ్నేశ్వర దాస్, నిల్లు గంతాయత్, విశ్వహిందూ పరిషత్ పట్టణ అధ్యక్షుడు కై లాష్ పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు.
రాయగడలో..
రాయగడ: వసంత పంచమి పురస్కరించుకుని విద్యాలయాల్లో సరస్వతీ దేవి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పాఠశాలల్లో నిర్వహించే పూజా కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొన్నారు.
మోడరన్ ఇంగ్లిష్ పాఠశాలలో..
జయపురం: స్థానిక మోడరన్ ఇంగ్లిష్ పాఠశాలలో సరస్వతీదేవి పూజలు భక్తితో నిర్వహించారు. పలు విద్యా సంస్థల్లో సరస్వతీ పూజలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment