భారీగా గంజాయి పట్టివేత
జయపురం: దట్టమైన అడవిలో మాఫియా దాచి ఉంచిన గంజాయి పోలీసులకు చిక్కింది. జయపురం సబ్‌డివిజన్ బొపరిగుడ పోలీసులు జి.మఝిగుడ పంచాయితీ టికరపడ సమీప దట్టమైన అడవిలో బొయిపరిగుడ పోలీసులు పది క్వింటాళ్ల 23 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు బొయిపరిగుడ పోలీసు అధికారిణి దీపాంజళీ ప్రధాన్ ఆదివారం పత్రికా ప్రతినిధులకు సూచన ప్రాయంగా తెలిపారు. జి.మఝిగుడ పంచాయతీ టికరపడ అడవిలో పెద్ద ఎత్తున గంజాయి ఉందన్న సమాచారం విశ్వాసనీయవర్గాల ద్వారా తెలిసిందన్నారు. వెంటనే సబ్‌ఇన్‌స్పెక్టర్ సంజీవ్ బెహర అడవిలో గంజాయి విషయం తెలుసుకోమని ఆదేశించగా అతడు పోలీసు టీమ్‌తో వెళ్లి అడవిలో గాలించగా ఒక చోట 38 బస్తాల్లో ఉన్న గంజాయి కనుగొన్నారు. వాటిని సీజ్ చేసి బొయిపరిగుడ పోలీసుస్టేషన్‌కు తీసుకురాగా మెజిస్ట్రేట్ సమక్షంలో తూకం వేయగా.. పది క్వింటాళ్ల 23 కేజీలు ఉన్నట్లు దీపాంజళి ప్రధాన్ వెల్లడించారు. పట్టుబడిన గంజాయి జయపురం కోర్టుకు తరలించినట్లు ఆమె వెల్లడించారు. గంజాయి మాఫియ ఇతర ప్రాంతాలకు తరలించేందుకు దట్టమైన అడవిలో గంజాయి దాచి ఉంచారని ఆమె వెల్లడించారు. అడవిలో గంజాయి దాచి ఉంచిన మాఫియాగ్యాంగ్‌లో ఏఒక్కరి ఆచూకీ తెలియరాలేదన్నారు. పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నామన్నారు. త్వరలోనే గ్యాంగ్‌ను అరెస్టు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment