ఆందోళనకు సేవా మిల్లు కార్మికులు సిద్ధం
జయపురం: తమ డిమాండ్ల సాధనకు ఈ నెల 9వ తేదీన ప్రజలతో సమావేశం నిర్వహించి, 13వ తేదీన ఆందోళన జరిపాలని గగణాపూర్ సేవా పేపరు మిల్లు కార్మిక నేతలు నిర్ణయించారు. ఆదివారం స్థానిక యాదవ భవనంలో కార్మిక నేత బసంత బెహర అధ్యక్షతన మిల్లు కార్మిక నేతలు, విశ్రాంత కార్మిక నేతలు, కంట్రాక్ట్ కార్మిక నేతుల కలిసి అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశంలో అచల వ్యవస్థలో ఉన్న పేపరు మిల్లు పరిస్థితి, మిల్లులో పనిచేస్తున్న కార్మికులకు అనేక నెలల నుంచి లభించని జీతాల సమస్య, విశ్రాంత కార్మికుల దురవస్థ, మరణించిన కార్మికుల కుటుంబాల దుస్థితి, కంట్రాక్ట్ కార్మికుల పీఎఫ్ సమస్యలపై నాయకులు చర్చించారు. కంట్రాక్ట్ కార్మికుల ప్రతినిధి సుందర నాయక్ కార్మికుల దయనీయ స్థితిని వివరిస్తూ యాజమాన్యం పీఎఫ్ డబ్బులు జీతాల నుంచి మినహా ఇస్తున్నా వాటిని ఖాతాల్లోని జయ చేయటం లేదని ఆరోపించారు. వారికి ఈపీఎఫ్ కూడా లేదని గతేడాది అక్టోబర్‌లో ఒక మహిళా కార్మికురాలు ప్రమాదానికి లోనైనా యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. స్వీపర్లకు రెండు నెలల నుంచి జీతాలు లేవన్నారు. కార్మక నేత ప్రమోద్ మహంతి మాట్లాడుతూ 2020 ఫిబ్రవరిలో మిల్లు విక్రయించారని, కొత్త కంపెనీకి 250 ఎకరాల అప్పజెప్పారని, మిల్లు కొని 5 ఏళ్లు గడచినా కొత్త యాజమాన్యం బిజినెస్ ట్రాన్సఫర్ ఒప్పందాన్ని అమలు చేయలేదని విమర్శించారు. 200 కోట్లు అప్పుచేసిన కొత్త యాజమాన్యం మిల్లు నడపలేకపోతుందని, కనీసం కార్మికులకు వేతనాలు చెల్లించటం లేదన్నారు. మిల్లులో పనిచేస్తున్న కార్మికుల, విశ్రాంత కార్మికుల, కంట్రాక్ట కార్మికుల పరిస్థితి నేడు దయనీయ స్థితిలో ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment