ఘనంగా సరస్వతీ పూజలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని కళాశాలలు, పాఠశాల్లోల వసంతపంచమి సందర్భంగా ఆదివారం సరస్వతీదేవి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సరస్వతి శిశు మందిర్‌లో 35 మంది చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ముందుగా జగన్నాఽథ్ స్వామి దేవాలయంలో చిన్నారులతో పూజలు చేయించారు.
చిత్తడి నేలలను రక్షించుకోవాలి
మల్కన్‌గిరి: చిత్తడి నేలలను రక్షించుకోవాలని వక్తలు అన్నారు. మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి అటటీశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎనినిమిద కిలోమీటర్ల బైక్ ర్యాలీ నిర్వహించి.. చిత్తడినేలల ప్రాధానతపై నినాదాలు చేశారు. గోవిందపల్లి అటటీ కార్యాలయం వద్ద నుంచి మత్తిలి బళదియాగూఢ వరకు ర్యాలీ సాగింది. అనంతరం జరిగిన సభలో ప్రేరణ మహిళా ట్రస్టు అధ్యక్షురాలు సంతోషిని పాత్రో, సృష్టి స్వచ్ఛంద సంస్థ సమన్వయకర్త కిశోర్ కుమార్ పాతిక ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రతిఓక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. మత్తిలి అటవీశాఖ అధికారి వాసుదేవ్ నాయక్ చిత్తడినేలల ప్రాధాన్యతను వివరించారు.
టిఫిన్ షాపులోకి
దూసుకెళ్లిన లారీ
ఆమదాలవలస: మండలంలోని పార్వతీశంపేట జంక్షన్ వద్ద ఆమదాలవలస– హిరమండలం రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున సరుబుజ్జిలి వైపు నుంచి శ్రీకాకుళం వెళ్తున్న లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న టిఫిన్ షాపులోకి దూసుకెళ్లింది. పార్వతీశంపేట జంక్షన్ వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. తెల్లవారుజామున షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదని అంటున్నారు. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
చిత్తడి నేలలతోనే జీవం మనుగడ
సోంపేట: చిత్తడి నేలలను పరిరక్షించడంతోనే జీవం మనుగడ సాధ్యమవుతుందని పర్యావరణ పరిరక్షణ సంఘ అధ్యక్షుడు డాక్టర్ వై.కృష్ణమూర్తి అన్నారు. ప్రపంచ చిత్తడి నేలలు దినోత్సవం సందర్భంగా సోంపేటలో ఆదివారం పలు కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, పర్యావరణ పరిరరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలో కళాసీసంఘ భవనంలో విద్యార్థులకు చిత్తడిననేలలు పరిరక్షణ పై అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ కృష్ణమూర్తి, గ్రీన్ క్‌లైమేట్ వ్యవస్థాపకుడు జె.వి.రత్నం, పర్యావరణ పరిరక్షకుడు బి.సత్య తదితరులు ప్రసంగిస్తూ చితడి నేలల ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రామినాయుడు, పాపారావు, ఎం.ఈశ్వరరావు, పర్యావరణ, మత్స్యకార నాయకులు బి.సుందరరావు, సనపల శ్రీరామమూర్తి, ఎన్.విజయ్‌కుమార్, నాగు, వెంకన్న, టి.తేజేశ్వరరావు, బి.శంకరరావు, కోదండరావు, సత్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.
చదువు వద్దన్నారని..
● విద్యార్థిని ఆత్మహత్య
ఎచ్చెర్ల క్యాంపస్: ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఎచ్చెర్ల మండలం కొంగరాం పంచాయతీ ఏజీఎన్‌పేటకు చెందిన మింది పూర్ణ (19) విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ(ఎంపీసీ) మొదటి ఏడాది చదువుతున్న పూర్ణ డిగ్రీ పూర్తిచేసి ఉన్నత చదువులు చదువుతానని కుటుంబ సభ్యులతో చెప్పింది. కుటుంబ సభ్యులు మాత్రం వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చి సమీప గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. దీంతో మనస్థాపానికి గురైన యువతి గత నెల 22న పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితికి చేరడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చేర్చించారు. మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేయగా.. పది రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం మృతి చెందింది. తండ్రి గణేష్ ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసునమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment