క్రీడలు విద్యార్థుల చురుకుదనానికి ప్రతీకలు
రాయగడ: క్రీడలను ప్రోత్సహించడం వల్ల విద్యార్థుల్లో చురుకుదనం పెరుగుతుందని జిల్లా అదనపు ఎస్పీ విష్ణు ప్రసాద్ పాత్రో అన్నారు. స్థానిక న్యూకాలనీలో గల సెయింట్ జేవియర్స్ స్కూల్‌లో ఆదివారం జరిగిన వార్షిక క్రీడోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతో పాటు ఆటల్లోనూ ప్రోత్సహించాలన్నారు. కేవలం నామమాత్రంగా నిర్వహించే క్రీడల వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. ప్రతి రోజూ కనీసం అరగంట సమయం క్రీడల్లో పాల్గొనేలా చూడాలన్నారు. అంతకు ముందు మజ్జి గౌరి మందిరం నుంచి క్రీడా జ్యోతిని తీసుకువచ్చి పాఠశాల ప్రాంగణంలో నిలిపారు. కబడ్డీ, ఖొ ఖొ, పరుగు పందాలు, స్పూన్ రేస్ వంటి అంఽశాలను నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ పట్నాయక్, సీఈఓ అచ్యుతానంద సామంత రాయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment