స్టేడియం నిర్మాణానికి స్థల పరిశీలన
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంద్రలో అతి పెద్ద ఇండోర్, ఔట్‌డోర్ స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న స్టేడియం కోసం స్థలాన్ని గుర్తించేందుకు కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర, కుంద్ర తహసీల్దార్ బినోద నాయక్ ఆదివారం కుంద్ర పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కుంద్ర పంచాయతీ సమీపంలో బంశువాగుడ గ్రామ సమీపంలో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని సందర్శించి ఆ భూమి ఏ కోవలోనికి వస్తుంది, స్టేడియానికి ఎంత భూమి కేటాయించగలరో ఒక రిపోర్టు తయారు చేసి ఇవ్వాలని తహసీల్దార్‌కు ఎమ్మెల్యే ఆదేశించారు. కుంద్ర సమీప చిలిగుడ రోడ్డు పక్కన గల అతి పెద్ద స్థలాన్ని గుర్తించారు. ఈ రెండు స్థలాల్లో అనువైనది ఎంపిక చేయాలని తహసీల్దార్‌కు సూచించారు. స్టేడియం నిర్మాణానికి 10 ఎకరాల స్థలం అవసరం ఉంటుందని వెల్లడించారు. ముఖ్యంగా గ్రామీణ అడవులు, పత్ర జంగిల్‌లో నివసించకూడదనే ఆంక్షలు ఉండటంతో ఇళ్లు ఖాళీ చేయాలని మూడు గ్రామాల వారికి రెండు సార్లు నోటీసులు పంపారని, తమకు పునరావాసం కల్పించాలని సాగరగుడ, మరో రెండు గ్రామాల ప్రజలు కోరారు. కుంద్ర మండల బీజేపీ అధ్యక్షుడు పద్మనాభ బిశాయి, మండలి ప్రతినిధి అమ్ము పాత్రొ, పార్టీ కోఆర్డినేటర్ రామేశ్వర జెన, మిలన్ ప్రదాన్, అభినాశ్ బెహర, శంకర మహంతి, దయా హరిజన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment