అభివృద్ధి నోచుకోని జంగొజొడి
● అర్ధంతరంగా నిలిచిన రహదారి పనులు
కూడా రెండేళ్ల క్రితం జరిగాయి. కొంత మొత్తం వరకు రొడ్డు పనులు చేసి మిగిలిన పనులను నిలిపివేశారు.
పాఠశాలకు వెళ్లని ఉపాధ్యాయులు
ఈ గ్రామంలో 2010లో ప్రాథమిక పాఠశాలను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇద్దరు ఉపాధ్యాయులను కూడా నియమించింది. పాఠాలు చెబుతున్నారా? లేదా అన్న విషయాన్ని సంబంధిత శాఖ అధికారులు మరిచారు. వారానికి కనీసం రెండు రోజులైనా ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చే దాఖలాలు లేవని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ఉపాధ్యాయులు కూడా పాఠశాలకు వేళ్లేందుకు ఇష్టపడటం లేదు. దీంతో చదువులు లేక విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందని గ్రామస్తులు జెమ్మా హుయిక, మండి హుయిక, బుధురు హుయిక ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం చొరవ తీసుకుని తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పిస్తే సమస్యలు దూరమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. 40 కుటుంబాలున్న ఈ గ్రామంలో సుమారు మూడు వందలకు పైచిలుకు జనాభా నివసిస్తున్నారు. తాగునీటి సౌకర్యార్థం రెండు గొట్టపు బావులు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఒకటి పూర్తిగా పనిచేయకపోవడంతో తాగునీటి కష్టాలు పడుతున్నారు. రానున్న వేసవి లోగానైనా అధికారులు చర్యలు తీసుకుని గొట్టపు బావిని బాగుచేయాలని కోరుతున్నారు.
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి పరిధిలో గల సునాఖండి గ్రామ పంచాయతీ పరిధిలోని జంగొజొడి గ్రామంలో మౌలిక సౌకర్యాలు లేక గ్రామస్తులు ఇక్కట్లు పడుతున్నారు. మాజీ మంత్రిగా వ్యవహరించే జగన్నాథ సరక ప్రాతినిధ్యం వహించే బిసంకటక్ నియోజకవర్గం పరిధిలో గల ఈ గ్రామం అభివృద్ధికి దూరంగా ఉంది. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. సుమారు 40 కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామంలో అందరూ ఆదివాసీలే. రెక్కాడితే గానీ డొక్కడని జీవితాలు. గ్రామం నుంచి పంచాయతీ కార్యాలయానికి వెళ్లాలంటే నరక యాతన పడాల్సిందే. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని మోరపెట్టు కోగా గత ప్రభుత్వం చాటికొన నుంచి జంగొజొడికి అనుసంధానించే విధంగా సుమారు 10 కిలో మీటర్ల దూరం రహదారిని ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.6 కోట్ల నిధులను కేటాయించింది. ఈ క్రమంలో పనులు ప్రారంభించేందుకు టెండర్లు
Comments
Please login to add a commentAdd a comment