రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు
తిరుమలలో తయారయ్యే లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సుప్రీంకోర్టు నిర్ణయం ఒక చెంపపెట్టు లాంటిది. నాకు డెయిరీ ఇండస్ట్రీలో 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఆవు నెయ్యిలో అలాంటి పదార్థాలు కలిపితే వెంటనే వాసన వస్తుంది. చంద్రబాబుకు కూడా డెయిరీ ఉంది. ఇలాంటి కల్తీ జరిగే అవకాశం లేదని తెలిసి కూడా రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం దారుణం. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. లడ్డూ వ్యవహారంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.
–బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే, వినుకొండ
●
Comments
Please login to add a commentAdd a comment