రాష్ట్ర ప్రభుత్వానికి చెంప దెబ్బ
సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయమంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంప దెబ్బ లాంటిది. ఏ మాత్రం ఆధారాలు లేకుండా మాజీ సీఎం జగన్‌పైన, అప్పటి టీటీడీ చైర్మన్, అధికారులపై ఆరోపణలు చేయటం ఏమాత్రం సబబుకాదని పరోక్షంగా చెప్పింది. ముఖ్యమంత్రి ముందుగానే కల్తీ జరిగిందని ప్రకటించి ఆ తర్వాత రాష్ట్రంలోని అధికారులతో సిట్ ఏర్పాటుచేస్తే.. ఆ అధికారులు సీఎం ప్రకటనను కాదని నివేదిక ఇస్తారా? సుప్రీంకోర్టు మంచి నిర్ణయం తీసుకుంది. పవన్ కల్యాణ్ మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారు.
–షేక్ మౌలాలి, ఎంఐఎం నరసరావుపేట పట్టణ అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment