వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే...
నెయ్యి కల్తీపై సరైన ఆధారాలు లేకుండానే చంద్రబాబు లడ్డూ వివాదం లేపారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా సూపర్–6 పథకాలను అమలు చేయలేకపోవడంతో వస్తున్న వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి మత రాజకీయాలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. బీజేపీ డైరెక్షన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ రాజకీయాలు సున్నితమైన మతాల చుట్టూ తిరుగుతున్నాయి. మణిపూర్లో మానవ హక్కులు కాలరాస్తున్నా పవన్ కల్యాణ్ ఇప్పటివరకు స్పందించలేదు. మోదీ చేసిన తప్పులకు పవన్ కల్యాణ్ ప్రాయాశ్ఛిత దీక్ష చేస్తే బాగుండేది.
–జీ అలెగ్జాండర్ సుధాకర్, డీసీసీ అధ్యక్షుడు, పల్నాడు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment