జే.పంగులూరు: నేడు స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల ఎస్‌ఆర్‌ఆర్ ఖోఖో అకాడమీలో రాష్ట్ర ఖోఖో జట్టు ఎంపిక జరుగుతుందని ఖోఖో రాష్ట్ర కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖేలో ఇండియా జూనియర్, సబ్‌జూనియర్ సౌత్‌జోన్ ఖోఖో పోటీలకు (బాలబాలిలకు మాత్రమే) తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ పట్టణంలో ఈ నెల 16,17,18 తేదీలలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు. మన రాష్ట్రం నుంచి బాలబాలికలు అండర్–14, అండర్–17 విభాగంలో జట్టు ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఈ ఎంపికలో 13 జిల్లాల నుంచి బాలబాలికలు హాజరవుతారని, సుమారు 100 మంది పాల్గొంటారని చెప్పారు. వీరిలో అండర్–14 విభాగంలో 15 మంది, అండర్–17 విభాగంలో 15 మందిని ఎంపిక చేయనున్నట్లు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె భాస్కరరావు, బీ కాశివిశ్వనాథ్ తెలిపారు. ఎంపికై నవారికి 10 రోజుల పాటు కోచింగ్ క్యాంపులు నిర్వహించి కోయంబత్తూరు జరిగే జాతీయ స్థాయి సౌత్ జోన్ ఖేలో ఇండియా ఖోఖో పోటీలలో పాల్గొంటారని తెలిపారు.
రేపు సీనియర్ బాలుర జిల్లా ఫుట్‌బాల్ జట్టు ఎంపిక
గుంటూరువెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ బాయ్స్ జిల్లా జట్టు ఎంపిక నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షుడు కుమ్మరి క్రాంతికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలను ఆదివారం పేరేచర్ల క్రీడా మైదానంలో మధ్యా హ్నం ఒంటి గంటకు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన జట్టును ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. ఆసక్తి కలిగిన వారు పత్రాలు తీసుకురావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment