కష్టపడే కార్యకర్తల కోసం గ్రీన్‌ బుక్‌ | - | Sakshi
Sakshi News home page

కష్టపడే కార్యకర్తల కోసం గ్రీన్‌ బుక్‌

Published Sat, Oct 5 2024 3:40 AM | Last Updated on Sat, Oct 5 2024 3:40 AM

కష్టపడే కార్యకర్తల కోసం గ్రీన్‌ బుక్‌

కష్టపడే కార్యకర్తల కోసం గ్రీన్‌ బుక్‌

నిత్యం అందుబాటులో ఉంటా

ఈ సభ ద్వారానే తాను గ్రీన్‌బుక్‌ ఓపెన్‌ చేస్తున్నా. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త పేరు ఆ బుక్‌లో రాస్తా. అధికారంలోకి వచ్చిన తరువాత వారి పేరును వై.ఎస్‌.జగన్‌ దృష్టికి స్వయంగా తీసుకెళతా. కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపి ముందుకు సాగే దిశగా అన్ని వేళలా అందుబాటులో ఉంటా. గుంటూరు జిల్లాలో ఎంపీ, ఏడు ఎమ్మెల్యే స్థానాలకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిపించుకునేందుకు మండల స్థాయి నుంచి ప్రతి కార్యకర్తను ఏకం చేసి ముందుకు సాగుతాం

–అంబటి రాంబాబు, వైఎస్సార్‌ సీపీ

గుంటూరు జిల్లా అధ్యక్షుడు

కార్యకర్తల కోసం ఏర్పాటైన సభలా ఉంది

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడిపిస్తోంది. మేం అధికారంలోకి రాగానే బ్లడ్‌ బుక్‌ రాస్తాం. ఈ సభ పదవీ స్వీకార సభలా కాకుండా.. కార్యకర్తల కేర్‌ సభలా ఉంది. మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి పథకం కేడర్‌ చేతుల మీదుగానే ప్రజలకు అందదాలన్న విషయాన్ని వై.ఎస్‌.జగన్‌ దృష్టికి తీసుకెళ్తా. సాయం చేసే చేతులు వై.ఎస్‌.జగన్‌వి. మాయమాటలు చెప్పే నైపుణ్యం చంద్ర బాబుది. దివంగత మహానేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పేదల గుండెల్లో ధైర్యాన్ని నింపారు. వై.ఎస్‌.జగన్‌ అదే పేదలకు సంక్షేమాన్ని అందజేశారు. నేను రెండు త్రిపుల్‌ ఆర్‌ సినిమాలు చూశా. ఒకటి ఎన్టీఆర్‌ నటించింది కాగా... రెండో సినిమాలో రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు నటించిన చిత్రం చంద్రబాబు డైరెక్షన్‌లో చూశా. మా వాళ్లపై దాడి చేస్తే బ్లడ్‌ బుక్‌లో రాయడం ఖాయం. అధికారులు వ్యవహరిస్తున్న తీరును అనుక్షణం గమనిస్తాం.

–మోదుగుల వేణుగోపాలరెడ్డి,

గుంటూరు, నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గాల పార్టీ పరిశీలకుడు

పట్నంబజారు/నెహ్రూనగర్‌: పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తల కోసం తాను గ్రీన్‌ బుక్‌ రాస్తానని వైఎస్సార్‌సీపీ గుంటూ రు జిల్లా అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యత లు స్వీకరించిన అంబటి రాంబాబు స్పష్టం చేశారు. శుక్రవారం గుంటూరు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి పదవీ స్వీకార సభ జరిగింది. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు అధ్యక్షత వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. అంబటి, మోదుగుల మాట్లాడారు. కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటానని అంబటి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడిపిస్తోందని, తాము గెలిస్తే బ్లడ్‌ బుక్‌ రాస్తామని గుంటూరు, నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గాల పార్టీ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రసంగిస్తూ... వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కూడా కార్యకర్త మాదిరిగా పనిచేసుకుంటూ ముందుకు సాగుతున్నారని చెప్పారు. రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్‌సీపీ కేడర్‌కు మనోధైర్యాన్ని కల్పించి ముందుకు తీసుకెళ్లే సత్తా అంబటికి, మోదుగులకు ఉందన్నారు. పార్టీకి దూరమైన వారిని కూడా దగ్గర చేసే దిశగా ప్రతి ఒక్కరూ సాగాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా తోడుగా నడిచేందుకు పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవం ఉన్న నేతలకు సముచిత స్థానం కల్పించి పార్టీని బలోపేతం చేసే దిశగా తీసుకున్న నిర్ణయం సంతోషకరం అన్నారు. నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ పాలన పక్కన పెట్టి కేవలం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్‌ చేస్తూ టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీ ఓడిపోలేదని, మోసపోయిందని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ రెండింటిని నిర్వీర్యం చేస్తోందన్నారు. పార్టీ నేత పూనూరి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ వంద రోజుల పాలనలో 60 మందిని పొట్టనబెట్టుకున్న చంద్రబాబుపై 302 సెక్షన్‌ ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర గ్రంథాలయాల మాజీ చైర్మన్‌ మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు నెలల కాలంలోనే ప్రజలంతా విసుగెత్తిపోయారని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరిఫాతిమా మాట్లాడుతూ ఇది ఫెయిల్యూర్‌ ప్రభుత్వమని మండిపడ్డారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతురావు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల వారికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పాలన ఈ దేశంలో ఎవరూ అందించలేదన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పార్టీని ఒక తాటిపై తీసుకు వచ్చి విజయానికి కృషి చేద్దామన్నారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ప్రతి జిల్లా నాయకులతో రివ్యూ మీటింగ్‌లు పెట్టి పార్టీని బలోపేతం చేస్తున్నారని గుర్తుచేశారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఏడు నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

అధికారంలోకి రాగానే వారికి తగిన ప్రాధాన్యం పదవీ స్వీకార సభలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి మా వారిపై దాడి చేసే ప్రత్యర్థుల కోసం బ్లడ్‌ బుక్‌ రాస్తాం గుంటూరు, నరసరావు పేట పార్లమెంటరీ నియోజకవర్గాల పార్టీ పరిశీలకుడు మోదుగుల హెచ్చరిక

మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే పొరపాటే...

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ , మంచితనాన్ని చేతగానితనం అనుకుంటే పొరపాటే... ఇకపై ఎవరికి వారే రెడ్‌బుక్‌ రాసుకోండని చెప్పారు. నాలుగు నెల పాలన చూస్తేనే పూర్తిగా టీడీపీ వైఫల్యం అర్థమవుతోందన్నారు. ప్రతిపక్ష లేకుండా ఎలిమినేట్‌ చేయాలని దురుద్దేశంతో రాక్షస మూకలు హింసా కాండలు, దౌర్జన్యాలతో పేట్రేగిపోతున్నారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వై.ఎస్‌.జగన్‌ ఒక్క కనుసైగ చేసి ఉంటే అసలు ఇవాళ టీడీపీ ఉండేది కాదని తేల్చి చెప్పారు. పవిత్రమైన లడ్డూ విషయంలో సుప్రీం కోర్టు చంద్రబాబుకు మొట్టికాయలు వేసిందన్నారు. పవన్‌ కళ్యాణ్‌ తన పార్టీని బీజేపీతో కలిపేసినట్లు ఉన్నారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement