24 గంటలు బుకింగ్ అవకాశం కల్పించండి
నరసరావుపేట: ఉచిత ఇసుక బుక్ చేసుకునే అవకాశాన్ని 24గంటలూ కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ డిమాండ్ చేశారు. ఇసుక వినియోగదారులు, భవన నిర్మాణ కార్మికులు, ముడిసరుకుల వినియోగదారుల తరపున జిల్లా కలెక్టరేట్ ఎదుట పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం ఆందోళన నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ ఇసుక బుకింగ్‌కు వారానికి ఒకసారి అర్ధరాత్రి ఆన్‌లైన్ ద్వారా అవకాశం కల్పించడంతో అక్రమదారులు మాత్రమే అవకాశం చేజిక్కించుకొని బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. 2020లో టన్ను ఇసుక రూ.550 ఉంటే ప్రస్తుతం రూ.2వేలకుపైగా ఉందని, అయినా దొరకటం కష్టంగా మారిందన్నారు. భవన నిర్మాణ రంగంపై జిల్లాలో ఒక లక్ష కుటుంబాలు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుండగా మరో లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు జీవనం సాగిస్తున్నారన్నారు. జిల్లాలోని రేవులు ధరణికోట, జడుగు, మల్లాది, కస్తల, కోనూరు, చమంతి, వెంకటాపురంలో తెరచి, పిడుగురాళ్ల నుంచి పులిచింతలలో కూడా ఇసుక రేవులు ఏర్పాటు చేయాలని కోరారు. బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టాలంటే ఇసుక రేవులు అన్నింటినీ తెరవాలని, తవ్వకంలో భారీ యంత్రాలను నియంత్రించాలని, రేవుల్లో స్థానికులకు అవకాశం ఇవ్వాలని, ర్యాంపుల వద్దనే వాహనాలకు ఇసుక లోడింగ్ చేయాలని, తెలంగాణ, కర్ణాటక, చైన్నె వంటి ఇతర రాష్ట్రాలకు తరలించకుండా నిఘా ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డి.శివకుమారి, జి.మస్తాన్‌వలి, శిలార్‌మసూద్, కామినేని రామారావు, టి.పెద్దిరాజు పాల్గొన్నారు.
క్రోసూరు: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరుతూ క్రోసూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ఆందో ళన నిర్వహించారు. సీపీఎం మండల కార్యదర్శి టి.హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత ఇసుకను అందిస్తానని హామీ ఇచ్చినప్పటికీ, ట్రక్కు ఇసుక ధర రూ.6000 వరకు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మా ణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నా రని అన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆన్‌లైన్ విధానం ద్వారా 24 గంటలు ఉచిత ఇసుకను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. తహసీల్దార్ కె.శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. సీపీఎం గ్రామ కార్యదర్శి చిలక యేషియ్య, నాయకులు షేక్ ముస్తఫా, బత్తుల కొండలు, కె.మల్లికార్జునరావు పాల్గొన్నారు.
సీపీఎం నాయకుల డిమాండ్
ఇసుక కొరతపై ధర్నాలు
Comments
Please login to add a commentAdd a comment