ఏఎన్యూకి ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేషన్
ఏఎన్యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేషన్ లభించింది. ఈ సర్టిఫికెట్ను శుక్రవారం వీసీ కె.గంగాధరరావు, రెక్టార్ కె.రత్నషీలామణి, రిజిస్ట్రార్ జి.సింహాచలం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ యూనివర్సిటీ నిర్వహణ, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, అంతర్జాతీయ ప్రమాణాలను ఈ సర్టిఫికెట్ తెలియజేస్తోందని వివరించారు. యూనివర్సిటీ కీర్తి ప్రతిష్టలు పెంచేందుకు నాణ్యమైన బోధన, పరిశోధన రంగాలను బలోపేతం చేసేందుకు ఇటువంటి గుర్తింపు సంస్థల సహకారం అవసరమని పేర్కొన్నారు. అటువంటి సంస్థల గుర్తింపుని తెచ్చుకునేలా అధ్యాపకులు, పరిశోధకులు నిరంతరం శ్రమించాలని సూచించారు. ఏఎన్యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పీపీఎస్ పాల్కుమార్, ఏఎన్యూ ఐక్యుఏసీ డైరెక్టర్ కృష్ణసత్య, అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.గోపి కృష్ణ, ర్యాంకులకు విభాగం కోఆర్డినేటర్ రవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment