విద్యార్థి మృతదేహానికి పోస్టుమార్టం
తాడికొండ: మండలంలోని పొన్నెకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి చెందాడని అతడి అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. గత నెల 24వ తేదీన నేల బావిలో ఈత కోసం వెళ్లిన విద్యార్థి షేక్ సమీర్ మృతి చెందిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదని, మృతదేహాన్ని అప్పగించాలని కోరడంతో తాము అప్పగించామని పోలీసులు తెలిపారు. అమరావతి మండలం కర్లపూడి గ్రామానికి చెందిన సర్పంచ్ రామారావు అది హత్య అని గుంటూరులో జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు జడ్పీ హైస్కూల్లో సోమవారం డిప్యూటీ డీఈవో విచారణ నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా అడుగు ముందుకేశారు. షేక్ సమీర్ అమ్మమ్మ షేక్ మస్తాన్ బీ తాడికొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం కర్లపూడి గ్రామంలో జీజీహెచ్ నుంచి వచ్చిన వైద్యులు ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. అమరావతి మండల తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు, తాడికొండ సీఐ కె.వాసు సమక్షంలో శవపంచానామా నిర్వహించారు. తుది నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
అమ్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment