24న యూటీఎఫ్‌ జిల్లా స్వర్ణోత్సవ సభలు | - | Sakshi
Sakshi News home page

24న యూటీఎఫ్‌ జిల్లా స్వర్ణోత్సవ సభలు

Published Wed, Nov 20 2024 1:48 AM | Last Updated on Wed, Nov 20 2024 1:48 AM

24న యూటీఎఫ్‌ జిల్లా స్వర్ణోత్సవ సభలు

24న యూటీఎఫ్‌ జిల్లా స్వర్ణోత్సవ సభలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: యూటీఎఫ్‌ 17వ జిల్లా స్వర్ణోత్సవ సభలను ఈ నెల 24న గుంటూరులోని ఎన్జీవో కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి. ఆదిలక్ష్మి, ఎం. కళాధర్‌ తెలిపారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో మంగళవారం మహాసభల ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాథమిక విద్యారంగాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారానే బడులు బాగుపడతాయని, ఆ బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. మహాసభల సందర్భంగా వేంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి ఉదయం స్వర్ణోత్సవ ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్‌ ఎం. హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షుడు జి. వెంకటేశ్వర్లు, కోశాధికారి ఎండీ దౌలా, కార్యదర్శులు సీహెచ్‌ ఆదినారాయణ, జి. వెంకటేశ్వరరావు, ఎం. గోవిందయ్య, అడవి శ్రీనివాసరావు, కె. ప్రేమ్‌కుమార్‌, ఎం. కోటిరెడ్డి, కె. ప్రభూజీ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

పెదకాకాని: జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని స్కూటీ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గుంటూరు గుండాలరావుపేటకు చెందిన ఆశీర్వాదం విజయవాడ నుంచి స్కూటీపై గుంటూరు బయలుదేరాడు. పెదకాకాని హెచ్‌పీ పెట్రోల్‌బంక్‌ సమీపంలో జాతీయ రహదారిపై డీజిల్‌ ట్యాంక్‌ లేక నిలిచిపోయిన లారీని ఢీ కొన్నాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement