ఎస్సీ బాలికల వసతి గృహంలో సమస్యల వలయం
297 మందికి ఒకటే మరుగుదొడ్డి
ఈ ఎస్సీ బాలికల వసతి గృహాన్ని 2014లో రూ.2.50 కోట్లతో నిర్మించారు. ఈ హాస్టల్లో ఇంటర్మీడియెట్, నర్సింగ్ (జీఎన్‌ఎమ్, ఏఎన్‌ఎం), డిగ్రీ విద్యార్థినులు 297 మంది ఉంటున్నారు. కూటమి సర్కారు అధికారం చేపట్టాక ఈ హాస్టల్ నిర్వహణ అధ్వానంగా మారింది. వసతి గృహాలకు బడ్జెట్ కేటాయించకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్న వాదన వ్యక్తమవుతోంది. బ్లీచింగ్, ఇతర వస్తువుల కొనుగోలుకూ వార్డెన్ సొంత డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ హాస్టల్లో కిటికీలకు తలుపులు లేవు. చలికి తోడు దోమల బెడద. దోమ తెరలు లేవు. మరుగు దొడ్లకు తలుపులు లేవు. ఒక మరుగుదొడ్డి పనిచేయడం లేదు. స్తంభించింది. 297 మందికి ఒకటే మరుగుదొడ్డి. అదీ దుర్గంధం వెదజల్లుతోంది. తాగునీటి వసతి లేదు. అన్ని అవసరాలకు మోటార్ నీరే గతి.
Comments
Please login to add a commentAdd a comment