పాచి ఆహారపదార్థాలే గతి!
హాస్టల్లో మెనూ ప్రకారం ఆహార పదార్థాలు అందడం లేదు. వారంలో రెండు రోజులు మాత్రమే అల్పాహారం వడ్డిస్తున్నారు. మిగిలిన రోజుల్లో రాత్రి వండిన అన్నమే గతి. మధ్యాహ్నం మిగిలిన అన్నం, కూరలను సాయంత్రం వడ్డిస్తున్నారు. అదేమని విద్యార్థినులు ప్రశ్నిస్తే సిబ్బంది అవమానకరంగా మాట్లాడతున్నారు. వేధిస్తున్నారు. ఈ కారణంగానే ఇటీవల ఇంటర్మీడియెట్ విద్యార్థినులు సంగం అఖిల, అన్నవరపు సనిత ఆత్మహత్యాయత్నం చేశారు. కొందరు విద్యార్థినులు ఈ ఆహారం తినలేక పాకెట్ మనీతో బయట అల్పాహారం, కురుకురే ప్యాకెట్లు కొని తిని అనారోగ్యం పాలవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment