No Headline
కారెంపూడిః రాష్ట్ర స్థాయి ఖోఖో క్రీడలకు కారెంపూడి ముస్తాబవుతోంది. ఈనెల 23, 24, 25 తేదీలలో జరగనున్న పోటీలకు స్థానిక బ్రహ్మనాయుడు జెడ్పీ హైస్కూల్ వేదిక కానుంది. ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ కారెంపూడిలో రాష్ట్ర స్థాయి క్రీడలు జరగనుండడం విశేషం. స్కూల్ గేమ్స్ ఫెఢరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రస్థాయి అండర్ 14 బాల, బాలికల ఖోఖో పోటీలు జరగనున్నాయి. మొదట 1996లో ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్లో అండర్–18 రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు జరిగాయి, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే రాష్ట్ర స్థాయి పోటీలకు కారెంపూడి వేదికవుతోంది. రాష్ట్ర నలుమూలల నుంచి 400 మంది క్రీడాకారులు కారెంపూడి రానున్నారు. ఉమ్మడి 13 జిల్లాల నుంచి బాల, బాలికల జట్లు పోటీలలో పాల్గొంటున్నాయి. వంద మంది వరకూ పీఈటీలు పోటీల నిర్వహణలో పాల్గొనబోతున్నారు. వారితోపాటు క్రీడా శిక్షకులు, క్రీడా సంస్థల అధికారుల రాకతో కారెంపూడి జెడ్పీ హైస్కూల్ ప్రాంగణం సందడిగా మారనుంది.
పోటీలు జరగనున్న బ్రహ్మనాయుడు
హైస్కూల్ ప్రాంగణం
కారెంపూడిలో మూడు దశాబ్దాల
తర్వాత రాష్ట్రస్థాయి క్రీడలు
రేపటి నుంచి మూడు రోజులపాటు
అండర్–14 ఖోఖో పోటీలు
ముస్తాబవుతున్న బ్రహ్మనాయుడు
జెడ్పీ హైస్కూల్ ప్రాంగణం
Comments
Please login to add a commentAdd a comment