అప్రమత్తంగా ఉండండి
బాపట్ల జిల్లా కలెక్టర్ సూచన
బాపట్ల: హ్యాకర్లు వివిధ ఫోన్ నంబర్లతో జిల్లా కలెక్టర్ గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు కలెక్టర్ ఫొటో, గుర్తింపు చిహ్నాలతో ఎవరికై నా సందేశాలు వస్తే స్పందించరాదని తెలిపారు. హ్యాకర్లు కలెక్టర్ గుర్తింపును దుర్వినియోగం చేస్తూ 94724 297132 నంబర్ నుంచి కొందరికి మెసేజ్‌లు వెళ్లాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తుల నంబర్లతో ఎలాంటి సమాచారం వచ్చిన తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు.
24న డీఫార్మసీ స్పాట్ అడ్మిషన్లు
గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో రెండేళ్ల కాల పరిమితి గల డీఫార్మసీ కోర్సులో 2024–25 విద్యాసంవత్సరానికి కౌన్సెలింగ్ తరువాత మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెల 24న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జాస్తి ఉషారాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ బైపీసీ, ఎంపీసీ, ఒకేషనల్ గ్రూపులు పూర్తి చేసిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ కాపీలతో రూ.6,300 ఫీజు చెల్లించి అడ్మిషన్ పొందవచ్చునని సూచించారు. ఇతర వివరాలకు 92471 20305, 98480 38769, 99593 24563 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
జీజీహెచ్‌కు రూ.9 లక్షల విరాళం
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో ఇంకుడు గుంతల అభివృద్ధి ద్వారా ఆసుపత్రిలో నీటి కొరతను నివారించేందుకు గుంటూరు వైద్య కళాశాల 1980 బ్యాచ్‌కి చెందిన విద్యార్థులు రూ. 9 లక్షలు విరాళం అందజేశారు. ఆసుపత్రి డెప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఉప్పాల శ్రీనివాస్‌కు పూర్వ వైద్య విద్యార్థులు రూ. 9 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా విరాళం అందజేసిన పూర్వ వైద్య విద్యార్థులు డాక్టర్ సిద్దాబత్తుని నాగేశ్వరమ్మ, డాక్టర్ శారద, డాక్టర్ రామారావులను డెప్యూటీ సూపరింటెండెంట్ అభినందనించారు.
ఫార్మసిస్టుల ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు కారార్యలయం పరిధిలో కాంట్రాక్టు పద్ధతిలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పది గ్రేడ్–2 ఫార్మసిస్టు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆర్డీ డాక్టర్ జి.సుచిత్ర తెలిపారు. సదరు నోఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్టును మంగళవారం విడుదల చేశామన్నారు. ఫైనల్ మెరిట్ లిస్టును, సెలక్షన్ లిస్టును సీఎఫ్‌డబ్ల్యూ.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులు ఈనెల 27న గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆర్డీ కార్యాలయంలో జరిగే కౌన్సెలింగ్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్‌లతో హాజరు కావాలన్నారు.
నేటి సదరమ్ క్యాంప్‌కు అన్ని ఏర్పాట్లు చేయండి
తెనాలిఅర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం జరగనున్న ప్రత్యేక సదరమ్ క్యాంప్‌కు అన్ని ఏర్పాటు చేయాలని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ గుంటూరు జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ మజీదాబేగం ఆదేశించారు. జిల్లా వైద్యశాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. తర్వాత మాట్లాడుతూ గతంలో సదరమ్ సర్టిఫికెట్లు పొందిన వారికి ప్రభుత్వం మరోసారి పరీక్షలు చేయిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment