దాడులను ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం
వేమూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. టీడీపీ నేతలు చేయించిన దాడుల్లో తీవ్రంగా గాయపడి తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ కార్యకర్త సురేష్‌ను బుధవారం మేరుగ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత జిల్లాలో కూటమి నాయకుల దాడులు పెచ్చుమీరాయన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యక్తలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, వారిపై ప్రైవేటు కేసులు వేసేందుకు వెనుకాడమని స్పష్టం చేశారు. ప్రతి నాయకుడు, కార్యక్తకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సురేష్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట చందోలు డేవిడ్ విజయకుమార్, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గోటిపాటి హేమ చంద్ర శ్రీనివాసరావు, ఎంపీపీ రాపర్ల నరేంద్ర, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment