ఆర్టీసీకి ‘పండగే’
నరసరావుపేట: జిల్లాలో సంక్రాంతిని పురస్కరించుకొని ఆరు డిపోల ఆర్టీసీ బస్సుల ద్వారా రూ.51.61 లక్షల ఆదాయం వచ్చిందని ఆర్టీసీ జిల్లా ప్రజారవాణా అధికారి ఎన్.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇది గతేడాది కంటే రూ.6.56 లక్షలు ఎక్కువని తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’కి తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతి సందర్భంగా నరసరావుపేట నుంచి 52, మాచర్ల 50, చిలకలూరిపేట 77, సత్తెనపల్లి 8, పిడుగురాళ్ల 23, వినుకొండ 61 బస్సులు కలిపి మొత్తం 271 ఏర్పాటు చేశామన్నారు. అవి 1,48,367 కిలోమీటర్లు తిరిగి 17,631 మందిని గమ్యస్థానాలకు చేర్చాయన్నారు. సంస్థకు రూ.51,61,834 ఆదాయం లభించిందని తెలిపారు. సహకరించిన డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది, ప్రయాణికులకు ధన్యవాదాలు చెప్పారు.
సంక్రాంతి ఆదాయం రూ.51.61 లక్షలు గతేడాది కంటే రూ.6.56 లక్షలు అదనం
Comments
Please login to add a commentAdd a comment