విద్యుత్ అదాలత్‌లపై అవగాహన కల్పించాలి
రాజుపాలెం: విద్యుత్ వినియోగదారుల అదాలత్ అవగాహన సదస్సుకు ఎక్కువ మంది హాజరయ్యేలా చూడాలని సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ ఎన్.విక్టర్ ఇమ్మానియేలు సిబ్బందిని హెచ్చరించారు. మండలంలోని కొండమోడు విద్యుత్ కార్యాలయంలో డివిజన్ స్థాయిలో విద్యుత్ వినియోగదారుల అదాలత్ అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా చైర్మన్ హాజరయ్యారు. తక్కువ సంఖ్యలో వినియోగదారులు రావడంతో సిబ్బందిపై మండిపడ్డారు. అన్ని గ్రామాలలో సదస్సు గురించి అవగాహన కల్పించి ఎక్కువ మంది వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. రాజుపాలెం, సత్తెనపల్లి, మాచవరం మండలాల నుంచి వినియోగదారులు పలు సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. 39 అర్జీలు రాగా, 34 పరిష్కారమయ్యాయి. అధిక బిల్లులు ఒకేసారి కట్టలేమని చైర్మన్ దృష్టికి వినియోగదారులు తీసుకెళ్లగా.. కిస్తీలవారీగా కట్టేందుకు పరిష్కారమార్గం చూపారు. 5 సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సదస్సులో పల్నాడు జిల్లా ఎస్‌ఈ డాక్టర్ విజయ్‌కుమార్, మాచర్ల ఈఈ నూతలపాటి సింగయ్య పిడుగురాళ్ల డీఈఈ బయన సురేష్‌బాబు, ఏఓ సందీప్‌కుమార్, ఏఈ సైదారావు, సోమ్లానాయక్ తదితరులు పాల్గొన్నారు.
సీజీఆర్‌ఎఫ్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment