మరికొన్ని ఇసుక రీచ్‌ల ఏర్పాటుకు పరిశీలన
అచ్చంపేట: మండలంలో 10 ఇసుక రీచ్‌లుండగా ఇసుక సరఫరాకు నాలుగు ఇసుక రీచ్‌ను టెండరు విధానంలో ఎంపిక చేసిన విషయం తెలిసిందే.. మరికొన్ని ఇసుక రీచ్‌లకు అనుమతులిచ్చేందుకు బుధవారం మైనింగ్, గ్రౌండ్‌వాటర్, పొల్యూషన్, రెవెన్యూ శాఖల అధికారులు జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. గింజుపల్లి, చల్లగరిక, చింతపల్లి, చామర్రు, కోగంటివారిపాలెం, కస్తల రీచ్‌ను పొల్యూషన్ కంట్రోల్‌బోర్డ్ అనలిస్ట్ వై.అనిల్‌కుమార్, మైనింగ్ సర్వేయరు వీవీ రవితేజ, రాయల్టీ ఇన్‌స్పెక్టర్ బి.పూర్ణచంద్రరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ కె.రామారావు, గ్రౌండ్ వాటర్ డీజీడబ్ల్యూఓ వి.శ్రీనివాసరావు, కృష్ణా రివర్ డీఈఈ ఎన్.అజయ్‌బాబు, ఏఈఈ పి.ప్రభు, సంబంధిత గ్రామాల వీఆర్వోలు రీచ్‌లను పరిశీలించినవారిలో ఉన్నారు. మండలంలో ఇప్పటికే అనుమతించిన నాలుగు రీచ్‌లలో ప్రస్తుతం ఒక రీచ్ నుంచే ఇసుక సరఫరా అవుతోంది. ఒక రీచ్‌ని అక్రమ మైనింగ్ జరుగుతున్న కారణంగా సంబంధిత అధికారులు మూసేశారు. మరో రెండు రీచ్‌లను ఇంతవరకు ప్రారంభించలేదు.
Comments
Please login to add a commentAdd a comment