సీటే ఎయిమ్
జేఈఈ మెయిన్...
గుంటూరు ఎడ్యుకేషన్ : దేశ అత్యున్నత విద్యాసంస్థలో సీటు సాధించడమే ధ్యేయంగా విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షకు బుధవారం హాజరయ్యారు. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2025 మొదటి సెషన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)కు విద్యార్థులు హాజరయ్యారు. బీఈ, బీటెక్ కోర్సుల్లోకి ప్రవేశాలకు ఉద్దేశించిన ఈ పరీక్షలు ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్నాయి. 30న మధ్యాహ్నం పేపర్–2 బీఆర్క్ పరీక్ష జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దీనికోసం గుంటూరులో మూడు, పల్నాడు జిల్లాలో రెండు చొప్పున ఇంజినీరింగ్ కళాశాలలతోపాటు అయాన్ డిజిటల్ జోన్‌లలో ఏర్పాటు చేసిన కేంద్రాల పరిధిలో పరీక్షలు జరిగాయి. మొత్తమ్మీద దాదాపు 10 వేల మందికిపైగా విద్యార్థులు రాస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గుంటూరు శివారు నల్లపాడులోని అయాన్ డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రం వద్ద సిబ్బంది మాత్రం దురుసుగా ప్రవర్తించారు. విద్యార్థుల వెంట వెళ్లిన తల్లిదండ్రులను పరీక్షా కేంద్రం సమీపంలో ఎక్కడా వేచి ఉండరాదని హెచ్చరించారు. ఉదయం 9 గంటల పరీక్షకు 7 గంటలకే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలని ఎన్‌టీఏ నిర్దేశించడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. నల్లపాడు పరీక్షా కేంద్రం వద్ద మీడియా ఫొటోగ్రాఫర్లపై అక్కడి సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు.
గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని ఐదు కేంద్రాల్లో సజావుగా నిర్వహణ
ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన సిబ్బంది గుంటూరులోని ఒక పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులతో దురుసు ప్రవర్తన విద్యార్థుల వెంట వెళ్లిన తల్లిదండ్రులపైనా అనుచిత వ్యాఖ్యలు ఫొటోలు తీస్తున్న మీడియా ఫొటోగ్రాఫర్లతోనూ అదే తీరు
Comments
Please login to add a commentAdd a comment