నేడు కానుకమాత చర్చి జెండా ఆవిష్కరణ
రెంటచింతల: పురాతన కానుకమాత చర్చి 175వ వార్షికోత్సవాలకు సర్వం సిద్ధమైంది. క్రీస్తు శిలువ వేసే సమయంలో పడిన పాట్లను గుర్తుచేసే 14 స్థలాలు ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. శాంతి, కరుణ, ప్రేమ, సహనం, దయ వంటి వాటిపై సమస్త మానవాళికి సూక్తులు బోధిస్తూ ఆధ్యాత్మిక కేంద్రంగా రాష్ట్రంలోనే ప్రత్యేకస్థానం కలిగిన ఈ చర్చిలో వేడుకలు ఫిబ్రవరి 2వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నవదిన ప్రార్థనలలో భాగంగా ప్రతి రోజు జపమాల, దివ్యపూజాబలి నిర్వహించనున్నట్లు విచారణ గురువు ఏరువ లూర్ధుమర్రెడ్డి అన్నారు. గురువారం విలేకర్ల సమావేశంలో ఫాదర్ వైఎల్ మర్రెడ్డి మాట్లాడుతూ.. 24న సాయంత్రం 4.30 గంటలకు మాచర్ల నిత్యసహాయ మాత చర్చి విచారణ గురువు (షష్టిపూర్తి) రెవ.ఫాదర్ కొమ్మారెడ్డి రఫేల్‌రెడ్డి జెండా ఆవిష్కరించిన అనంతరం ప్రాంగణంలో దివ్యపూజా బలితో మహోత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. 25న ఆరోగ్యమాత మందిరం, 26న ఫాతిమా మాత మందిరం, 27న బాలవికాస్ హైస్కూల్ వద్ద ఉన్న నిత్య సహాయమాత మందిరం, 28న లూర్దుమాత మందిరం, 29న ఆనందపేటలో, 30న పిచ్చుకలగడ్డ వద్ద, 31న పునీత ఆరోగ్యనాథుడి మందిరం, ఫిబ్రవరి 1న పునీత అంతోని వారి మందిరం వద్ద దివ్యపూజాబలి సమర్పించనున్నట్లు తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 4.30 గంటలకు నిర్వహించనున్న ఈ నవదిన ప్రార్థనలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు.
175వ వార్షికోత్సవానికి సిద్ధమైన మందిరం నేటి నుంచి నవదిన ప్రార్థనలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment