అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
లక్ష్మీపురం(గుంటూరువెస్ట్) : అంగన్‌వాడీ కార్యకర్తలకు ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒ.లలిత డిమాండ్ చేశారు. ఈ మేరకు స్ధానిక అమరావతి రోడ్డులోని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో కమీషనర్ వేణుగోపాల్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏఐటీయుసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వేతనాల పెంపుపై కూటమి ప్రభుత్వం ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా తమను పిలిచి సమస్యలపై చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. త్వరలో పరిష్కారమవుతాయని చెప్పారు. కమిషనర్‌ను కలిసిన వారిలో ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ హనుమంతరావు, స్వరూప రాణి, విజయ దుర్గ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment