ఏషియన్ యోగాలో శ్రీకృష్ణకు బంగారు పతకం
గుంటూరు ఎడ్యుకేషన్: భాష్యం విద్యార్థులు చదువుతో పాటు తాము ఎంచుకున్న రంగాల్లో రాణిస్తూ, అంతర్జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చడం గర్వకారణంగా ఉందని విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ పేర్కొన్నారు. చంద్రమౌళీనగర్‌లోని భాష్యం మెయిన్ క్యాంపస్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ అశోక్‌నగర్‌లోని భాష్యం స్కూల్లో తొమ్మిదో తరగతి (ఐఐటీ) చదువుతున్న దేవరాజుగట్టు ధీరజ్ శ్రీకృష్ణ సింగపూర్‌లో ఈనెల 6వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరిగిన ఏషియన్ యోగా స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌లో భారతజట్టుకు ప్రాతినిధ్యం వహించారని తెలిపారు. ఒక బంగారు పతకంతో పాటు రెండు రజత, కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నట్లు చెప్పారు. ఏషియన్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో 47 ఏళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్ విద్యార్థికి బంగారు పతకం వచ్చిందని చెప్పారు. బాలుర జూనియర్ విభాగంలో తలపడిన ధీరజ్ శ్రీకృష్ణ ఆర్టిస్టిక్ యోగాలో బంగారు పతకం, యోగాసన, ఆర్టిస్టిక్ పెయిర్ యోగాసనలో రజతం, రిధమిక్ యోగాలో కాంస్య పతకాలు గెలుపొంది సత్తా చాటాడని వివరించారు. యోగాలో ప్రతిభను గుర్తించి గతంలో భాష్యం తరఫున రూ.లక్ష నగదు అందజేశామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ధీరజ్ శ్రీకృష్ణ తండ్రి నాగరాజు, తల్లి శశికళ, విజయవాడ భాష్యం జెడ్‌ఈవో జోషి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment