![రాష్ట](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/11022025-g_amt_tab-02_subgroupimage_1883337616_mr-1739217506-0.jpg.webp?itok=jgL9fSqY)
రాష్ట్రస్థాయి చేతిరాత పరీక్షలో కంతేరు విద్యార్థిని ప్రత
కంతేరు(తాడికొండ): రాష్ట్రస్థాయిలో నిర్వహించిన చేతిరాత పరీక్షలో తమ పాఠశాల విద్యార్థిని ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించిందని కంతేరు జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం టి.పద్మావతి తెలిపారు. ఈ నెల 8వ తేదీన గుంటూరులోని హిందూ కళాశాలలో గుడ్ కాలీగ్రాఫర్స్ కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కాలీగ్రాఫ్ (చేతిరాత) పోటీలలో పాల్గొన్న తమ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని ద్వితీయ బహుమతి పొందడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో పలువురు ఉపాధ్యాయులు, సొసైటీ మాజీ చైర్మన్ వాసిరెడ్డి జయరామయ్య తదితరులు విద్యార్థినిని అభినందించారు. విద్యార్థినికి గైడ్‌గా వ్యవహరించిన ఉపాధ్యాయుడు ఎ.వెంకటరెడ్డిని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో విద్యాకమిటీ చైర్మన్ ఎ.విజయ్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
అక్రమంగా విద్యుత్ వాడితే కఠిన చర్యలు
కాకుమాను: నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్‌ను వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ జి.ఆంజనేయులు అన్నారు. పెదనందిపాడు మండలంలోని పలు గ్రామాలలో సోమవారం విద్యుత్ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆంజనేయులు మాట్లాడుతూ గృహవసరాలకు, వాణిజ్య సముదాయాలకు విద్యుత్ కనెక్షన్‌లు పొందిన వారు నిబంధనలకు అనుగుణంగా వినియోగించాలన్నారు. పబ్లిక్ పోల్స్‌పై కనెక్షన్‌లను ఏర్పాటు చేసుకుని, విద్యుత్ మీటర్లు తిరగకుండా చేస్తే అటువంటిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అధికారులు 35 బృందాలుగా ఏర్పాడి 1176 ఇంటి సర్వీసులను, 5 వాణిజ్య మీటర్లను తనిఖీ చేసి 405 సర్వీసు మీటర్లు అనుమతించిన లోడు కంటే అదనంగా విద్యుత్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించి రూ.15.72 లక్షల అపరాధ రుసుము విధించారు. దాడుల్లో విజిలెన్స్ శాఖ అధికారి మల్లిఖార్జున్, పొన్నూరు ఏడీఈ శ్యామ్ కుమార్, ఏఈ బి.వీరాంజనేయులు పాల్గొన్నారు.
![రాష్ట్రస్థాయి చేతిరాత పరీక్షలో కంతేరు విద్యార్థిని ప్రత1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10tdk81-150117_mr-1739217506-1.jpg)
రాష్ట్రస్థాయి చేతిరాత పరీక్షలో కంతేరు విద్యార్థిని ప్రత
Comments
Please login to add a commentAdd a comment