![ఆర్‌వీఆర్‌జేసీ కళాశాలకు జాతీయస్థాయిలో ఏఏ రేటింగ్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10ptp91-150124_mr-1739217507-0.jpg.webp?itok=5Raz8zJP)
ఆర్‌వీఆర్‌జేసీ కళాశాలకు జాతీయస్థాయిలో ఏఏ రేటింగ్
గుంటూరు రూరల్: ఎన్‌పీటీఈఎల్ పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు కనబరిచిన విశేష ప్రతిభకు 12వ సారి తమ కళాశాలకు జాతీయ స్థాయిలో ఏఏ రేటింగ్, రెండు ప్రత్యేక అవార్డులు రావడం సంతోషంగా ఉందని ఆర్‌వీఆర్‌జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, డాక్టర్ జగదీష్ మద్దినేనిలు తెలిపారు. చౌడవరం గ్రామంలోని కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అవార్డులతోపాటుగా దేశంలోని అన్ని లోకల్ చాప్టర్స్‌లో తమ కళాశాల అగ్రస్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపులో భాగంగా, కళాశాల విద్యార్థులు 85 గోల్డ్, 1,012 ఎలైట్, 439 సిల్వర్ గ్రేడ్‌లను సాధించడంతోపాటు 62 మంది టాపర్ సర్టిఫికెట్లు పొందారన్నారు. ఇటీవల ఐఐటీ మద్రాస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల ప్రతినిధులు ఈ అవార్డులను స్వీకరించారన్నారు. ఎన్‌పీటీఈఎల్ కోర్సు లు ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకునేందుకు అనుకూలంగా ఉంటాయని కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ఆర్.గోపాలకృష్ణ, ట్రెజరర్ డాక్టర్ కె.కృష్ణప్రసాద్‌లు తెలిపారు. ఈ కోర్స్‌లలో టాపర్‌గా నిలిచిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా అవార్డులు, జాతీయ స్థాయిలో రేటింగ్‌ను పొందేందుకు కృషిచేసిన అధ్యాపకులు, విద్యార్థులను కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె.రవీంద్ర, ఏఓ డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, ఎన్‌పీటీఈఎల్ లోకల్ చాప్టర్ సమన్వయకర్త, సీఎస్‌డీ విభాగాధిపతి డాక్టర్ ఎంవీపీ చంద్రశేఖర్ తదితరులు అభినందించారు.
రెండు ప్రత్యేక అవార్డులు సైతం..
Comments
Please login to add a commentAdd a comment