![స్టేట్ కరాటే చాంపియన్ షిప్‌లో విద్యార్థుల ప్రతిభ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10stpl03-150155_mr-1739217508-0.jpg.webp?itok=0mjtjQXC)
స్టేట్ కరాటే చాంపియన్ షిప్‌లో విద్యార్థుల ప్రతిభ
సత్తెనపల్లి: రాష్ట్ర స్ధాయి కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో సత్తెనపల్లి విద్యార్ధులు ప్రతిభ కనబరిచారు. కృష్ణా జిల్లా విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్ కరాటే డు, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో స్టేట్ కరాటే ఛాంపియషిప్ ఈ నెల 9న జరిగింది. ఈ టోర్నీలో సత్తెనపల్లికి చెందిన షీకోకాయ్ షిటోరియో కరాటే స్కూలు విద్యార్థులు 11 మంది విజయఢంకా మోగించారు. కటా విభాగంలో 11 మంది ప్రతిభ చూపి గెలుపొందారు. వీరిలో ఎనిమిది మంది విద్యార్థులు జూన్‌లో డిల్లీలో జరిగే జాతీయస్థాయి కరాటే పోటీలకు ఎంపికయ్యారు. వ్యక్తిగత బాలికల కటా విభాగంలో 13 ఏళ్ల కేటగిరిలో ఎం.దేవిశ్రీ (గోల్డ్‌మెడల్), 12 ఏళ్ల కేటగిరిలో డి.బాలవైష్టవి (గోల్డ్‌మెడల్), 10 ఏళ్ల కేటగిరిలో బి.అక్షయారెడ్డి (గోల్డ్‌మెడల్), 14 ఏళ్ల కేటగిరిలో టి.నిఖిత (సిల్వర్‌మెడల్) సాధించారు. వ్యక్తిగత బాలుర కటా విభాగంలో 12 ఏళ్ల కేటగిరిలో బి.సత్యనారాయణ(గోల్డ్‌మెడల్), బి.టిష్యంత్(గోల్డ్‌మెడల్), ఎమ్‌వీ బాలాజీ (గోల్డ్‌మెడల్), 11 ఏళ్ల కేటగిరిలో ఎస్.ఎం.ఎస్.దినేష్ (గోల్డ్‌మెడల్), ఎల్.కిదీట్(గోల్డ్‌మెడల్), 12 ఏళ్ల కేటగిరిలో ఎల్.గేష్టు అషిత్ (సిల్వర్‌మెడల్), 11 ఏళ్ల కేటగిరిలో, కె.తేజ్‌ప్రకాష్(సిల్వర్‌మెడల్) పతకాలు కై వసం చేసుకున్నారు. ప్రతిభ చూపిన విద్యార్ధులను స్టేట్‌వైస్ ప్రెసిడెంట్ నల్లూరు మోహన్‌రావు, షిహాన్ అనుముల రాంబాబు, అనుముల రామయ్యలు సోమ వారం ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment