No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, Apr 20 2024 1:25 AM

స్కూల్‌హెల్త్‌ కార్యక్రమంలో రక్తపరీక్షలు చేస్తున్న సిబ్బంది  - Sakshi

పార్వతీపురంటౌన్‌: గతంలో గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ, పారిశుద్ధ్య కార్యక్రమాలు అంతంతమాత్రంగానే ఉండేవి. గిరిజనుల ప్రాణాలంటే గతంలో పాలకులకు లెక్క ఉండేది కాదు. 2012 నుంచి 2018 వరకు జిల్లాలో మలేరియా తీవ్రత అధికంగా ఉంది. మరణాలు కూడా ఎక్కువగా నమోదయ్యేవి. వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో జీవించే ప్రతి ఒక్కరికి ఆరోగ్య భరోసా కలిగింది. సీజనల్‌ వ్యాధుల నివారణే లక్ష్యంగా సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి వైద్యారోగ్య కార్యక్రమాలను విస్తృతం చేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి 50 కుటుంబాలకు గ్రామ వలంటీర్‌ సేవలు అందుబాటులోకి తెచ్చారు. సీజనల్‌ వ్యాధుల నివారణకు ప్రభుత్వ యంత్రాగం పలు చర్యలు చేపట్టింది. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతం చేసింది. మరోవైపు దోమల నివారణకు మలేరియా, వైద్యారోరోగ్యశాఖ బృందాలు నిరంతరం పనిచేశాయి.

జిల్లావ్యాప్తంగా 4,42,400 దోమతెరలు

2022లో జిల్లావ్యాప్తంగా 4,42,400 దోమతెరలను ప్రభుత్వం పంపిణీ చేసింది. దోమతెరల వినియోగంపై వైద్యబృందాలు, సచివాలయ ఉద్యోగులు గిరిజనులకు అవగాహన కల్పించారు. ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు వ్యాధుల సీజన్‌గా ప్రభుత్వం గుర్తించి వైద్యారోగ్య కార్యక్రమాలను చేపడుతోంది. 2019 నుంచి నుంచి దోమల నివారణతో పాటు మలేరియా తీవ్రతను అరికట్టడంలో మలేరియా, వైద్యారోరోగ్యశాఖలు ఎంతో శ్రమించాయి. ప్రతి ఏడాది రెండు దఫాలుగా దోమల నివారణ మందు పిచికారీ చేస్తున్నాయి. ప్రతి గ్రామంలో ఇంటిలోపల, బయట దోమల మందు పిచికారీని తప్పనిసరిగా చేయించాలనే నిబంధనను సచివాలయ ఉద్యోగులు అమలు చేశారు. గ్రామ వలంటీర్లు తమకు నిర్దేశించిన గిరిజన కుటుంబాల నివాసాల వద్ద దగ్గరుండి దోమల నివారణ మందు పిచికారీ చేయించారు. ఇంటింటా ఫీవర్‌ సర్వే విజయవంతంగా నిర్వహించారు. చిన్నపాటి జ్వరం వచ్చినా వైద్యసిబ్బంది వెంటనే రక్త పరీక్షలు చేసేవారు. మలేరియా, ఇతర జ్వరాలను నిర్ధారించి సకాలంలో వైద్యసేవలు అందించడంతో జ్వరపీడితులు కోలుకున్నా రు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించడంతో మలేరియా వ్యాధి బారిన పడి ఎవరూ మృతి చెందలేదు.

’మే 15 నుంచి దోమల నివారణ మందు పిచికారీ

ఈఏడాది కూడా దోమల నిర్మూలన కార్యక్రమాలకు మలేరియా, వైద్య ఆరోగ్యశాఖలు చర్యలు చేపట్టాయి. ఎన్నికల కోడ్‌ రాకముందే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో మలేరియా నివారణకు చేపట్టాల్సిన చర్యలను నిర్దేశించింది. ఈ మేరకు జిల్లాలో 401 మలేరియా పీడిత గ్రామాలను గుర్తించి మే 15 నుంచి మొదట విడత దోమల నివారణ మందు పిచికారీని జిల్లా మలేరియాశాఖ ప్రారంభించనుం ది.

Advertisement
Advertisement