కొనలేం.. తినలేం..
విజయనగరం ఫోర్ట్: దీపావళి పండగను ఆనందంగా జరుపుకోవాలన్న ప్రజలను ధరల బాంబు భయపెడుతోంది. నిత్యావసర సరుకులు, బాణసంచా సామగ్రి ధరలు అమాంతం పెరగడంతో సగటు జీవులు ఆవేదన చెందుతున్నారు. ఇంత ధరల పెరుగుదల ఏనూడా చూడలేదంటున్నారు. కనీసం పిల్లలకు పిండివంటకాలు చేసి పెడదామన్నా నూనె ధరలు సెగపుట్టిస్తున్నాయని వాపోతున్నారు. మార్కెట్‌కు వెళ్తే ఏమీ కొనలేం.. తినలేం అన్న పరిస్థితి నెలకొంది. కూరగాయల దగ్గర నుంచి పప్పులు, ఆయి ల్, ఉల్లి పాయలు ఇలా.. అన్ని ధరలు పెరగ డం పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందిగా మారింది.
అమాంతం పెరిగిన ఆయిల్ ధరలు
గత ఏడాది కంటే ఈ ఏడాది ఆయిల్ ధరలు బాగా పెరిగాయి. పామాయిల్ లీటరు ధర గత ఏడాది రూ.90 ఉంటే ప్రస్తుతం రూ.125కు చేరింది. రిఫైండ్ ఆయిల్ లీటర్ గతేడాది రూ.105 నుంచి రూ.110 ఉంటే ప్రస్తుతం రూ.135 ఉంది. పప్పులు, పిండి, నూక ధరలు కూడా అమాందం పెరిగాయి. గతేడాది కంది పప్పు కిలో రూ.150 ఉంటే ప్రస్తుతం రూ. 180 ఉంది. పంచదార కిలో రూ.42 నుంచి రూ.48కు, పెసరపప్పు కిలో రూ.90 నుంచి రూ.110కి, శనగపప్పు రూ.65 నుంచి రూ.100కు, మినపపప్పు రూ.110 నుంచి రూ.120కు, వేరుశనగ పలుకులు రూ.100 నుంచి రూ.120, గోధుమ పిండి రూ.40 నుంచి రూ.50, మైదా పిండి రూ.40 నుంచి రూ.50, గోధుమ నూక కిలో గతేడాది రూ.40 ఉంటే ప్రస్తుతం రూ.48కి పెరిగింది.
రూ.500 దాటిన వెల్లులి ధర
వెల్లులి ధర గణనీయంగా పెరిగింది. గతేడాది వెల్లుల్లి కిలో ధర రూ.80 నుంచి రూ.100 ఉంది. ప్రస్తుతం రూ.350 నుంచి రూ.520 వరకు పలుకుతోంది. ఉల్లి కిలో రూ.25 నుంచి రూ.50కు, పచ్చిమిర్చి రూ.40 నుంచి రూ.70, బంగాళదుంపలు కిలో రూ.20 నుంచి రూ.35– రూ.40 పలుకుతున్నాయి. కూరగాయలదీ ఇదే పరిస్థితి.
పెరిగిన టపాసుల ధర
దీపావళి పండగ నాడు టపాసులు ప్రతి ఒక్కరూ కాల్చుతారు. అయితే, వీటి ధరలూ పెరిగాయి. 12 రకాల టపాసుల ప్యాకెట్ గత ఏడాది రూ.250 నుంచి రూ.300 ఉంటే ప్రస్తుతం రూ.350 నుంచి రూ.450కు విక్రయిస్తున్నారు. 34 రకాల ప్యాకెట్టు గత ఏడాది రూ.500 ఉంటే ప్రస్తుతం రూ.700 విక్రయిస్తున్నారు. 66 రకాలు ఉన్న ప్యాకెట్ ధర గతేడాది రూ.700 ఉంటే ప్రస్తుతం రూ.1000 నుంచి రూ.1200కు విక్రయిస్తున్నారు.
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు
గతంలో కంటే పెరిగిన ఆయిల్ ధరలు
కూరగాయలు, టపాసులు ధరలదీ అదే పరిస్థితి
పామాయిల్ లీటర్ గతేడాది రూ.90 ప్రస్తుతం రూ.125
రిఫైండ్ ఆయిల్ గతేడాది ధర రూ.105 ప్రస్తుతం రూ.135
సామాన్యులపై ధరల భారం
దీపావళి పండగ అంటే ఇంటిల్లిపాదీ ఆనందంగా జరుపుకునే పండగ. ఈ ఏడాది నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు, ఆయిల్ ధరలు బాగా పెరిగాయి. సామాన్యులకు పండగ భారంగా మారింది. గతంలో మూడు, నాలుగు రకాలు పిండి వంటలు వండుకునేవారం. ఇప్పడు ఒకరకం పిండి వంటతో సరిపెట్టుకోవాలని అనుకుంటున్నాం. – రంధి దేముడు, పెదవేమలి
Comments
Please login to add a commentAdd a comment