ఆధార్ తరహాలో అపార్ కార్డు
● విద్యార్థుల వివరాలను త్వరితగతిన నమోదుచేయాలి ● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురంటౌన్:
జిల్లాలో ఆధార్ తరహాలో ఉండే అపార్ (అటోమెటెడ్ పెర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) కార్డులను విద్యార్థులకు జారీ చేసేందుకు వివరాలను త్వరితగతిన నమోదుచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఉపాధ్యాయ సిబ్బందికి సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సమావేశ మందిరంలో పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అపార్ నంబర్‌తో విద్యార్థి చరిత్ర మొత్తం తెలిసిపోతుందని, విద్యార్థుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కలెక్టర్ చెప్పారు. వన్ నేషన్–వన్ ఐడీ పేరుతో 17 అంకెలుండే అపార్ కార్డులను ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జారీచేసినట్టు వెల్లడించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అపార్ కార్డులు జారీఅవుతాయన్నారు. కార్యక్రమంలో డీఈఓ నల్ల తిరుపతినాయుడు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment