వేగవంతంగా శంబర జాతర పనులు
● అధికారులకు కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ ఆదేశం
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి జాతర పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎ.శ్యాంప్ర సాద్ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి 27, 28, 29 తేదీల్లో జరగనున్న శంబర జాతర పనులను ఆయన బుధవారం పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనులు జరిపించాలన్నారు. దీనికోసం అవసరమైన నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. వచ్చే ఏడా ది జనవరి 15లోపు పనులు పూర్తిచేయాలన్నా రు. ఆయన వెంట ఆర్డీఓ హేమలత, డ్వామా పీడీ రామచంద్రరావు, పీఆర్ డీఈ చిన్నంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
రాళ్ల బియ్యం సరఫరాపై విచారణ
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): రేషన్ దుకాణాల్లో పేదలకు సరఫరా చేసిన బియ్యంలో రాళ్లు ఉండడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే విషయంపై ‘రాళ్ల బియ్యం తినేదెలా?’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన ఫొటో వార్తకు అధికారులు స్పందించారు. కురుపాం తహశీల్దార్ కార్యాలయం హెచ్‌డీటీ సురేష్, వీఆర్వో జయరాజు పి.లేవిడి గ్రామానికి వెళ్లి రేషన్ లబ్ధిదారులతో మాట్లాడారు. రేషన్ బియ్యంలో మట్టి రాళ్లు ఉండడంపై విచారణ జరిపారు. సేల్స్‌మేన్ నుంచి వివరాలు సేకరించారు. బియ్యం సరఫరా చేసిన డీఆర్ డిపోను కూడా పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.
జీసీసీ నిత్యావసర సరుకుల
సరఫరాకు టెండర్లు
సీతంపేట: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలకు జీసీసీ ఆధ్వర్యంలో సరఫరా చేసే నిత్యావసర సరుకులకు బుధవారం ఐటీడీఏలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో టెండర్లు నిర్వహించారు. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినపగుళ్లు తదితర వస్తువులకు అధికారులు టెండర్లు నిర్వహించారు. ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబు మాట్లాడుతూ వసతిగృహాలకు నాణ్యమైన సరుకులు సరఫరా చేయకపోతే చర్యలు తప్పవన్నారు. టెండర్‌దారులు ఇప్పుడు చూపిస్తున్న శాంపిల్స్, తరువాత పంపిణీ చేసేవి ఒకే రకంగా ఉండాలన్నారు. లేదంటే రిటర్న్ చేస్తామని, అవసరమైతే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామన్నారు. కార్యక్రమంలో జీసీసీ డీఎం సంధ్యారాణి, సీతంపేట, పాతపట్నం బ్రాంచ్ మేనేజర్లు దా సరి కృష్ణ, గొర్లె నరసింహులు, గోదాం సూపరింటెండెంట్ ధర్మారావు, హెచ్‌డబ్ల్యూఓలు పాలక అమల, హెచ్.శారద, పి.రాజారావు, వెంకటినాయుడు, తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం కార్పొరేషన్‌కు అవార్డు
విజయనగరం: ఇంధన పొదుపులో విజయగనరం మున్సిపల్ కార్పొరేషన్ అవార్డును సొంతం చేసుకుంది. స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు–24 పేరిట ఆంధ్రప్రదేశ్ ఇంధన పొదుపు మిషన్ ఇచ్చే అవార్డుల్లో విజయనగరం కార్పొరేషన్ సిల్వర్ అవార్డును దక్కించుకుంది. ఈ నెల 20న విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో అవార్డును అందుకునేందుకు రావాలని కమిషనర్‌కు పిలుపు అందింది. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, నగర పంచాయతీలు పోటీ పడగా... విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌కు సిల్వర్ అవార్డు దక్కడం విశేషం. ఇటీవల ప్రధానమంత్రి స్వానిధి యోజన పథకం అమల్లో గుర్తింపు పొందిన విజయనగరం కార్పొరేషన్‌కు మరో అవార్డు వరించడంపై అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment